-టిడిపిని రాష్ట్రం నుంచే తరిమేద్దాం
-ఫ్యాన్ గెలుపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి మలుపు..!
-ఏపీ ఆర్టీసీ కడప రీజినల్ చైర్ పర్సన్ మంజుల ఓబులేష్
రాప్తాడు:రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయడం ద్వారా టిడిపిని రాష్ట్రం నుంచే తరిమేద్దామని ఏపీ ఆర్టీసీ కడప జోనల్ చైర్ పర్సన్ మాధవంతం మంజుల ఓబులేష్, వైయస్సార్సీపి సీనియర్ నాయకురాల్లు తోపుదుర్తి శైలజా రెడ్డి, గంగుల భానుమతి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ప్రసన్నయపల్లి పంచాయతీలోని RJC ప్యాలెస్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్సీపి పాలనలో మంచి జరిగితేనే ఓటేయాలని అడిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో 99 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి పార్టీలకతీతంగా నిరుపేదలకు లబ్ధి చేకూర్చడం జగనన్నకే దక్కిందన్నారు పేదలు, మహిళలకు అన్ని వర్గాల వారికి మంచి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అని కొనియాడారు. చంద్రబాబు హయాంలో అమరావతి సచివాలయంలో ప్రభుత్వం ఉండేది. మన ప్రభుత్వంలో ప్రతి గ్రామానికో సచివాలయం ఉందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు అప్పట్లో పేదలు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందేవి కాదన్నారు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే రాయ వర్గాలకు మేలు జరిగిందని చెప్పారు వైఎస్ఆర్సిపి నే గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని రోడ్లు డ్రైనేజీ తాగునీటి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో అధికారం కోసం ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులను మహిళలను యువకులను మోసం చేశారని మండిపడ్డారు మేనిఫెస్టోను భగవద్గీతగా ఖురాన్ గా బైబిల్ గా భావించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసి ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నారని కొనియాడారు ఎన్నికల్లో కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టిడిపి కూటమి నాయకులు ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ముందుకు వస్తున్నారని వారి మోసాలకు బలి కావద్దని ప్రజలకు సూచించారు అవినీతి రహిత సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ జగనన్న గెలుస్తాడని అర్థమైపోయి విజయవాడలో జగన్మోహన్రెడ్డిపై దాడి చేయించారు. జగనన్నను కాపాడుకోవాలి. ఆయన రాజుగా ఉన్నన్ని రోజులూ మన జీవితాలు బాగుంటాయి. వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయండి. ఒక ఓటు ఎంపి అభ్యర్థిని బోయ శాంతమ్మ అక్కకు, మరో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం మండల ఇన్చార్జ్ సత్యనారాయణరెడ్డి వైస్ ఎంపీపీ రామాంజనేయులు మండల కన్వీనర్ శేఖర్ స్థానిక నాయకులు లోకేశ్వర్ రెడ్డి విజయ వర్ధన్ రెడ్డి, బోయ మనోహర్యూత్ కన్వీనర్ విశ్వనాథరెడ్డి , రవి రామచంద్ర , జయన్న తదితరులు పాల్గొన్నారు.