హిందూపురంటౌన్ :జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నందు ఉపాధ్యాయులు, ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు ఎన్ని రకములు, అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అగ్ని ప్రమాదాలను ఎలా అర్పివేయలి , తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులతో ప్రయోగాత్మకంగా ప్రదర్శింప చేశారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ప్రభాకర్ తో పాటు, ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు.