వారికి నచ్చితేనే… నచ్చకపోతే నోటీసులు
సున్నం వేసుకో…కన్నం వేయం…
వారే పరిమితులు చెబుతారు…సాకులు చెబుతారు…
కళ్ళముందే అక్రమాలు ఉన్న కనిపించలేదు…
కాసులు ముట్టాయా…లేక కాకలు తీరిన వీరులున్నారా
బక్క చిక్కినోడికే నిబంధనలు.. బలిసి నోడికి వర్తించవా..
ఇందుకేనా ప్రభుత్వాలు..ప్రభుత్వ అధికారులు ఉండేది..
సున్నం వేస్తే అన్నీ సక్రమవుతాయా ..
ఎవరు రాశారో ఈ ప్రత్యేక రాజ్యాంగం…
అమరావతి:రాజు చేస్తే రాజరికం…సేవకులు చేస్తే అనాగరికం అన్న తీరుగా ఉంది బెజవాడ కార్పొరేషన్,సీఆర్డీఏ అధికారుల తీరు. ఏ రాజ్యం లోనైన, ఏ దేశంలో నైనా ,ఏ ప్రాంతంలో నైనా అక్రమం అక్రమమే..సక్రమం సక్రమమే.. కానీ ఒక బెజవాడ అధికారులకే అన్నీ సక్రమంగా కనిపిస్తున్న ట్లుంది.రాజకీయ పలుకు బడి ఉండి పైసలు కర్చుబెడితే ఏదయినా వంకరలు సక్రమంగా అవుతాయన్న పరిస్థితి బెజవాడ కార్పొరేషన్, సీఆర్డీ ఏ అధికారులు కొత్త అర్థాన్ని తీసుకవచ్చినట్లు కనిపిస్తోంది. కారణం కళ్ళముందే వారు చూపించన చూపిస్తున్న నిబంధనలలోనే అన్నీ ఉన్నాయి.మరి ఆ నిబంధనలు వారే చూపిస్తూ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఓ వైపు ఒప్పుకుంటూనే మరో వైపు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించడానికి గాల కారణాలు చూస్తే వారి విధి విధానాలు ఏమిటో అర్థమవుతోంది.
బెజవాడ కార్పొరేషన్, సీఆర్డీఏ పరిధిలో గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్ అనేది అనేక రకాల వ్యాపారానికి కీలకం. గతంలో ప్రభుత్వం మొదటి అంతస్తు వరకు దాదాపు 400 షాపులు నిర్మించి పలువురి వ్యాపారులకు నామమాత్రంగా రుసుము వసూలు చేసి వారికి పూర్తి హక్కులు ఇవ్వడమైనది.వ్యాపారాభివృద్ది చెందిన తరువాత అక్కడ కొంతమంది తమ అవసరాల కోసం అదనపు అంతస్తులు నిర్మించారు,నిర్మించుకుంటున్నారు… నిర్మాణం చేపడుతున్నారు…ఇవన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్రమం.ఆ విషయాన్ని ఆ అధికారులే దృవీకరిస్తున్నారు.అయితే చర్యలు తీసుకోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టేది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదుగా నగరంలోని ప్రధాన వ్యాపారం సముదాయం లోనే..అయినా అధికారులు అధికారులకు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.ఓ వ్యాపారి ఏకంగా ఉన్న బిల్డింగ్ పై మరో రెండస్తుల నిర్మాణం చేపట్టి చక్కగా లిఫ్ట్ కూడా ఏర్పాటు కు రెడీ అయ్యాడు.చివరి వరకు మౌనంగా ఉన్న అధికారులు ఆ తరువాత ఏమి జరిగిందో, ఎక్కడ వ్యవహారం బెడిసికొట్టిందో తెలియదు కానీ ఆ బిల్డింగ్ పై ఒకటి రెండూ నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టారు.అయితే అటు వైపు నిర్మాణం చేస్తున్న వారి ఊసే పట్టనట్లు ఉన్నారు అధికారులు. అసలు వ్యాపార సముదాయాలు నివాసాలు ఉండేందుకు అక్రమ నిర్మాణాలు నిర్మించుకుని ఉంటున్నారు.

అయితే అధికారులు చెప్పే లెక్క సూపర్ అని చెప్పాలి.సున్నం వేశారు కాబట్టి మేము కన్నం వేయం,అందులో నివాసం ఉంటున్నారని చెప్పడం విడ్డురంగా ఉంది. అలా అనుకుంటే నిలువ నీడ లేని వారు ఓ చిన్న గది నిర్మించుకుంటే దయ దాక్షిణ్యాలు లేకుండా కూల్చివేసి తమ ప్రతాపాన్ని చూపిస్తున్న సంఘటనలపై ఇలాంటి అధికారులు ఏమి సమాధానం చెబుతారో మరి.రాజ్యాంగం ఇచ్చిన పరిమితులు అనదరికే ఒక్కటే అన్నది ప్రజలు ఉద్ధరించడానికి ప్రజల శ్రమతో జీతాలు తీసుకునే ఈ అధికారులకు అందరూ ప్రజలు ఒక్కటే అన్న విషయం ఎందుకు మరిచిపోతున్నారో అర్థం కావడం లేదు.డబ్బు, హోదా ఉంటే ఈ సమాజంలో ఏదయినా చేయొచ్చు అన్న అన్న కొత్త పోకడలు తావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.ఇలాంటి వ్యవస్థలతో ప్రజలకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో వేచిచూద్దాం.
