పులివెందుల:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ బడుగు బలహీన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన సాధనకు కృషి చేయాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల రహిత సమాజం కోసం పరితపించారన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మునయ్య, తదితరు టిడిపి నాయకులు పాల్గొన్నారు.