ప్రొద్దుటూరు : గొప్ప చరిత్ర కలిగిన తొగటవీర క్షత్రియులు ధర్మం వైపు నిలవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక తొగటవీర క్షత్రియ కళ్యాణమండపములో నిర్వహించిన తొగటవీర క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిషాసుర సంహారం లో అమ్మవారికి సహాయంగా నిలిచిన వారు తొగటవీర క్షత్రియులని, ఆ తల్లి స్వయంగా వారికి కుల దైవంగా నిలిచిందని, పరమేశ్వరుడు వీరి పోరాట పటిమ చూసి నేత వృత్తిని వీరికి కులవృత్తి గా అప్పగించారని వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు తిరిగి అధికారం లోకి రాకుండ తొగటవీర క్షత్రియులు వైసీపీ వైపు నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొగటవీర క్షత్రియ ప్రముఖులు బండారు రఘురామయ్య, పల్లా శేషయ్య, బండారు సూర్యనారాయణ, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, ఆర్సీపిఏ మెంబర్ కాకర్ల నాగశేషారెడ్డి, వైసీపీ ప్రజాప్రతినిధులు, కుల బాంధవులు పాల్గొన్నారు.