విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
సింగ్ నగర్ వద్ద రాయి విసిరిన ఆగంతుకుడు
కంటి పైభాగాన బలంగా తాకిన రాయి


విజయవాడ:-
సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా, సింగ్ నగర్ వద్ద ఆగంతుకులు రాళ్లు విసిరాడు. సమీపంలో ఉన్న స్కూలు భవనం పై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. కాగా, క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్టు భావిస్తున్నారు. పోలీసులు స్కూలు భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్డులో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైనట్టు తెలుస్తోంది.
