Tuesday, May 6, 2025

Creating liberating content

తాజా వార్తలుచంద్రగిరిలో ఘనంగామహాత్మ జ్యోతిరావు ఫూలే197వ జయంతి..

చంద్రగిరిలో ఘనంగామహాత్మ జ్యోతిరావు ఫూలే197వ జయంతి..

చంద్రగిరి :చంద్రగిరి బస్టాండ్ టవర్ క్లాక్ వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే197వ జయంతినీ జ్యోతిరావు పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, టెంకాయలు కొట్టిఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకట ముని మాట్లాడుతూ “జ్యోతిరావు ఫూలే” భారతీయసామాజిక సంస్కర్త.అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారన్నారు. వెనుకబడిన కులాల ప్రజలకు సమాన హక్కులనుపొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటుచేశారు.భార్య 
సావిత్రిబాయి ఫులే తో కలసి దేశంలో మొదటి సారిగా మహిళా విద్యకు మార్గదర్శకాలు రూపొందించి మహిళలకు మరియు వెనుకబడిన కుల ప్రజలకువిద్యను అందించారు. బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించారు. వితంతువుల కోసం ఒక గృహాన్ని స్థాపించారు. అందరికి విద్య యొక్క ఆవశ్యకతను సమర్థించిన మొదటి సంస్కర్త ఫూలే అని కొనియాడారు. ప్రధాన కార్యదర్శి రాగూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లో సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11నజన్మించారు.
మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచించారు. గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు. కుల వివక్ష పైపోరాడారు.బడుగు బలహీన వర్గాలపై అగ్రకులాలు ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు.సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించారు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిభాయి ని పాఠశాలకు పంపారు. 1848 ఆగస్టులో బాలికలకు మొదటి పాఠశాల స్థాపించారు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరాని వారికి కూడా బోధించవలసిరావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ ఫూలే తన భార్య సావిత్రి భాయి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశారు. 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించారు. డాక్యుమెంట్ రైటర్ ముని కేశవులు మాట్లాడుతూ
ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన ఉంది.
మద్యపానాన్ని వ్యతిరేకించి ప్రభుత్వానికి లేఖలు వ్రాసారు. స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. నరేష్ కుమార్ నాయుడు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించి అంటరానితనంపై ఉద్యమించారు. కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించారు. దీనబంధు’ వారపత్రిక ద్వారా రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవారు. డిష్ గోపి మాట్లాడుతూ
సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రకటించారు. గోపాల్ మాట్లాడుతూసమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసిన కృషికి ఫూలేకి ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారనిమహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశారన్నారు.ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే మండల ఆశయ సాధన సమితి కమిటీ అధ్యక్షులు వెంకట ముని, ప్రధాన కార్యదర్శి రాగూరు చంద్రశేఖర్, తిలక్ యాదవ్,డాక్యుమెంట్ రైటర్ కేశవులు, ఎస్. రామ్మూర్తి, నరేష్ కుమార్ నాయుడు, డిష్ గోపి, గోపాల్, సత్య, దామోదర్ నాయుడు, నారాయణ, వాసు ,బాలసుబ్రమణ్యం ఆచారి, కే.శంకర్, వి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article