- కందికుంట సమక్షంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరిక
కదిరి :తనకల్లు మండలంలోని తవళం పంచాయతీలో ఉన్న రాగినేపల్లి, మార్పురి వాండ్లపల్లి గ్రామాలకు చెందిన 30 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎన్డీఏ కూటమి కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వైసీపీ సొంత పార్టీ నాయకులు విసిగిపోయి తెలుగుదేశం పార్టీలోకి వలస బాటపడుతున్నారని తెలిపారు. వారందరికీ కందికుంట మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనకల్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.