గాజువాక:86వ వార్డు రసాలమ్మ కాలనీలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 86వ వార్డు ఇన్చార్జి దామా సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. ప్రతి ఇంటి నుంచి పిల్లాపాపలతో మహిళలు బయటకు వచ్చి ప్రచారం ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ ప్రచార కరపత్రాన్ని అందజేస్తూ తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ ప్రచారంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ముఖ్యమంత్రి తనను నియమించారని, తాను ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే గాజువాక అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీన్ తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నవరాత్రి నవరత్నాలను 98 శాతానికి పైగా అమలు చేశారని, స్వతంత్ర వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ, ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవని, జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యపడిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన మేలు మరువకుండా ఎన్నికల్లో మహిళలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అమర్నాథ్ అభ్యర్థించారు.
కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి, విశాఖ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి బొత్స ఝాన్సీ, నాగిరెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య, గురుమూర్తి రెడ్డి,మెడికల్ బాబు,హరీష్ వర్మ,శ్రీనివాస్,రామలక్ష్మి,మోల్లి చిన్న,ప్రసాద్,ప్రమీల,వర్మ,ప్రసాద్,సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


