కామవరపుకోట :స్థానిక ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఎన్నికల అధికారి మొహిద్దీన్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీలలో భాగంగా భీమడోలు కు చెందిన ఒక వ్యక్తి నుండి 75 వేల రూపాయలు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. స్వాధీన పరుచుకున్న నగదును తహసిల్దార్ జేవిఆర్ రమేష్ సారథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సత్యవేణి కి అప్పగించటం జరిగిందన్నారు.ఈ నగదును ఏలూరు ఎన్నికల విభాగపు ట్రెజరీ అధికారి వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదు గల వ్యక్తికి ట్రెజరీ నుంచి సొమ్ము వెనక్కి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ స్వామి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సిఐఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.