మాజీ మంత్రి కె.ఎస్.జవహర్
బుట్టాయగూడెం. ఈనెల 5వ తేదీన చింతలపూడిలో జరగనున్న రా.. కదలిరా ..బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ పిలుపునిచ్చారు. బుట్టాయిగూడెం లోని పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన శుక్రవారం జరిగిన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీమంత్రి కెఎస్. జవహర్ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జవహర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వ తేదీన చింతలపూడి లో జరగనున్న రా.. కదలి రా.. బహిరంగ సభ విజయవంతం చేయటంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, మండలాల అబ్జర్వర్లు నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని అన్ని మండలాల నుండి భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయటానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా పని చేయాలని అన్నారు. గెలుపు పై ధీమాతో పాటు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని, వేసే ప్రతి అడుగు గెలుపు దిశగా వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు జయవరపు శ్రీరామ్మూర్తి, శీలం వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారేపల్లి రామారావు, ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రప్రగడ శ్రీనివాస్, తెలుగురైతు జిల్లా కార్యదర్శి గద్దె అబ్బులు, మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, పారేపల్లి నరేష్, ములిశెట్టి నాగేశ్వరరావు, అమరవరవు అశోక్, బొడ్డు కృష్ణ, మండలాల అబ్జర్వర్లు మువ్వా శ్రీను, దొంతు మంగేశ్వరరావు, చిట్టిబోయిన రామ లింగేశ్వరరావు, చెల్లుబోయిన శ్రీనివాస్, అల్ల గోవింద్, మాజీ జడ్పీటీసీ బాసిన రాజిబాబు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.