దేశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఐదో విడత పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 14 స్థానాలకు, మహారాష్ట్రలో 13, వెస్ట్ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒరిస్సాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకాశ్మీర్, లడఖ్‌లలో ఒక్కో స్థానానికి చొప్పున పోలింగ్ నిర్వహించనున్నారు. ఐదో విడతల బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు.