అనంతపురము :నగరంలోని 41వ డివిజన్‌లో ‘ఇంటింటికీ వైసీపీ’
బుధవారం కూడా కొనసాగింది. నాలుగున్నరేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తో పాటు
ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేశారు. మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని.. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఎమ్మెల్యే, పార్టీ నేతలు ప్రజలను, లబ్ధిదారులను కోరారు.
