మండపం పల్లి ఎంపీటీసీ సుంకేసుల భాష,
ఒంటిమిట్ట:సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి టిడిపి,జనసేన,బిజెపి, పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల తో 4000 పింఛన్ పెంచడంపై. అలాగే మెగా డీఎస్సీ విడుదలపై మొదటి సంతకం చేస్తానన్న చంద్రబాబు బాబు హామీతో యువకుల్లో, వృద్ధుల్లో నూతన ఉత్సాహం ఉరకలేస్తుంది అని ఒంటిమిట్ట మండలం మండపం పల్లె ఎంపీటీసీ సుంకేసుల భాష, అన్నారు బుధవారం నాడు మండపం పల్లి, గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన సోదరుడు సువాసి మురళి, సుఖవాసి శ్రీనివాసులు తో కలిసి మండపం పల్లి, గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో కలిసి తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని, సైకో విధించిన వివిధ రకాల పన్నులు విద్యుత్ ఛార్జీలు పెంచి, ధరలు నియంత్రణ చేయడంలో తీవ్రంగా విఫలమైన ప్రభుత్వం ఇదేనని, మట్టి ఇసుక అధిక ధరలకు అమ్మి ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేశారని గుర్తు చేశారు,త్వరలో సైకో పాలనకు స్వస్తి చెప్పి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాజధాని అభివృద్ధి రాష్ట్రంలో అనేక కంపెనీలు రప్పించి నిరుద్యోగ యువతీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతి యువతకు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు అందించి ఆదుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ ఎస్.వి రమణ, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, మాజీ ఎంపీపీ బొడ్డే లక్ష్మీనారాయణ, చలమయ్య యాదవ్, పసుపులేటి వెంకటరమణ, రోశయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు భార్య తన పాల్గొన్నారు.

