నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 109వ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి మరో పక్క బాలయ్య వరుస హిట్స్ తో తన ఫ్యాన్స్ కి ఫీస్ట్ ని కంటిన్యూ చేస్తుండగా ఇపుడు మరో క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. బాలయ్య కెరీర్ లో చేసిన ఎన్నో పవర్ ఫుల్ పాత్రలు అండ్ సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో “సమరసింహా రెడ్డి” కూడా ఒకటి.మరి మాస్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో హిస్టీరియాని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా ఈ మార్చ్ 2న అయితే గ్రాండ్ గా 4కే వెర్షన్ లో రిలీజ్ కాబోతుంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మరి