Thursday, May 8, 2025

Creating liberating content

తాజా వార్తలు2 కోట్ల విలువైనమొబైల్ ఫోన్లు రికవరీ

2 కోట్ల విలువైనమొబైల్ ఫోన్లు రికవరీ

650 మొబైల్స్ బాధితులకు అప్పగింత

జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్

కడప బ్యూరో

పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్స్ ను తిరిగి బాధితులకు ముట్టజెప్పడంలో రాష్ట్రంలోనే కడప పోలీసులు తొలి స్థానంలో నిలిచారు, జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీపడ పడకుండా బాధితులకు చేరేంతవరకు జిల్లా పోలీసులు చర్యలు తీసుకొని సుమారు.
రెండు కోట్ల రూపాయల విలువజేసే 650 మొబైల్ ఫోన్లు భాదితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూమొబైల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జిల్లాలతో పాటు కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లినా వదలకుండా రికవరీ చేయడం జరిగిందని తెలిపారు, సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచించారుఅమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనుగోలు చేయాలన్నారు,
ఆసుపత్రుల్లో మా కుటుంబ సభ్యులకు సీరియస్ గా ఉందని … డబ్బు అవసరమై ఈ మొబైల్ ను అమ్ముతున్నామని నమ్మబలుకుతూ తస్కరించిన మొబైల్ ఫోన్లను అమ్మే వీలుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మోసపు మాటలతో నమ్మబలికే వారి పట్ల ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి.అపరిచితుల ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు… అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తించి దూరంగా ఉండాలి. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచిన జిల్లా పోలీస్ (సి ఈ ఐ ఆర్) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ అనే పోర్టల్ సేవల ద్వారా బాధితులకు కడప పోలీసులు న్యాయం చేస్తున్నట్టు తెలిపారు,
ఫోన్ చోరీకి గురైనా, మిస్ అయినా జిల్లాలో సమీపములోని పోలీసు స్టేషనుకు వెళ్ళి ఫిర్యాదు చెయ్యవచ్చును. వెంటనే సిమ్, ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నంబర్, మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది అన్నారు,జిల్లా పోలీస్ సైబర్ విభాగం సి.ఐ లు శ్రీధర్ నాయుడు, మధు మల్లేశ్వర్ రెడ్డిలు, యస్ఐ జీవన్ రెడ్డి సిబ్బందిని అభినందించడమే కాకుండా సెల్ ఫోన్ల రికవరీలో మంచి కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు జిల్లా ఎస్పీ అందజేశారు,బిల్లు లేకుండా సెల్ ఫోన్ అమ్ముతామంటు నమ్మబలికే వ్యక్తులు సెల్ ఫోన్ దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలోని పోలీసుస్టేషన్ కు లేదా సంబందిత పోలీసు అధికారులకు సమాచారం చేరవేయాలని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article