గొల్లప్రోలు
గొల్లప్రోలు లోని దేవుడి గుడి రామ కోవెలలో ఈనెల 19న శ్రీ సీతారాముల నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రామకోవెల బక్త మండలి సభ్యులు తెలిపారు. శనివారం భక్తమండలి సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ 19న ఉదయం 4 గంటల నుండి విఘ్నేశ్వర పూజ,మండపారాధనలు,10-39 నిముషములకు మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, సీతాదేవి దంపతులచే విగ్రహ ప్రతిష్ట, కళా న్యాసము, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు వివరించారు.20న భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటలకు కలశ స్థాపన, జ్యోతి ప్రజ్వలన జరుగుతుందని అనంతరం 75 వ ఏకాహ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.21న ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అనంతరం కడారి తమ్మయ్య నాయుడు, సీతాదేవి దంపతుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు రామ కోవెల భక్తమండలి సభ్యులు తెలిపారు. సదరు కార్యక్రమంలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.