లేపాక్షి : ఈనెల 15 లోపు ఈ క్రాప్ ఈ కేవైసీ రైతులతో చేయించాలని హిందూపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అల్తాఫ్ అలీ ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం అధ్యక్షులు ప్రభాకర్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఏడీఏ అల్తాఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, రైతులతో వెంటనే ఈ క్రాప్ బుకింగ్ కోసం ఈ కేవైసీ వేయించుకోవాలన్నారు. కందులు ,రాగి పంటల మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. పీఎం కిసాన్ 16వ విడత త్వరలోనే రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. అందుకోసమే రైతులు ఈ కేవైసీ, ఎంపీసీఐ చేయించుకోవాలని రైతులకు సూచించారు. పట్టు పరిశ్రమ శాఖ ఉద్యానవన శాఖలో అమలు అవుతున్న పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణస్వామి, జడ్పిటిసి బాణాల శ్రీనివాసరెడ్డి , మండల స్థాయి సలహా మండలి సభ్యులు గోపాలప్ప ,తిప్పన్న ,శంకర్ రెడ్డి, తిప్పన్న, నాయకులు , రైతులు, వ్యవసాయ అధికారి శ్రీలత , క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.