సభలు సమావేశాలు నిషేధంసీఐ జి మధుబాబు
జీలుగుమిల్లి/పోలవరం :ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పోలవరం పోలీసు స్టేషన్ / మండలము పరిధిలో గల అన్ని పార్టీ నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు ఎన్. సురేష్ కుమార్ రెడ్డి, యస్.డి.పి.ఓ, పోలవరం వారి అధ్యక్షతన, పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు సారధ్యంలో పోస్ట్ పోల్ వయోలెన్స్, కౌంటింగ్ డే రోజు లా & ఆర్డర్ పరిరక్షించుటకు శాంతి కమిటీ మీటింగ్ ఏర్పాటు పాలు విషయాలపై అవగాహన కల్పించారు.
సెక్షన్ 144 సీఆర్పీసి, పోలీస్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున జూన్ 4 వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్బంగా 4,5,6 తేదీలో మండలంలో ఏ ప్రాంతంలో కూడా గుంపులుగా ఉండుట, అనుమతి లేని సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుట, బాణాసంచా ప్రయోగించుట, ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో వదంతులను ప్రచారం చేయడం నేరం అని తెలియజేశారు, సాధారణ జన జీవనానికి ఎటువంటి విఘాతం కలిగించరాదని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు. సంబంధిత నాయకులు వారి వారి అనుచరులు, కార్యకర్తలు, అభిమానులకు ఈ విషయంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించి వారిని అదుపు చేసి శాంతి భద్రతల పరిరక్షణ లో పోలీసులకు సహకరించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పోలవరం యస్.ఐ. పవన్ కుమార్ మరియు సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


