వేంపల్లె
స్థానిక పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో 11వ తేది ఆదివారం వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో
వాసవి మాతకు 102 కలశాలతో పాలాభిషేకం, గణపతి పూజా పుణ్యావచనం, తదితర విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చండీహోమం, గుండ ప్రవేశం జరుగునని తెలిపారు.అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం జరుగుతుందన్నారు.