అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. మధ్యాహ్నం 12:29 గంటలకు 84 సెకన్ల పాటు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తైంది. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తాయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు. రామాలయంలో జరగనున్న ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండి.. విస్తృతంగా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు.