పట్టించుకోని అధికారులు……
..
కాకినాడ
తొలగింపునకు గురైన జిజిహెచ్ ఆప్కాస్ ఉద్యోగుల నిరసన మూడు సంవత్సరాలు కావస్తున్న స్పందించని ప్రభుత్వ తీరుపై సదా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీరుపై కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుని ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా ప్రభుత్వ మాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎటువంటి ముందస్తు కారణాలు చూపకుండా పనిచేస్తున్న 65 మంది ఆప్కాస్ ఉద్యోగులను తొలగించిన తీరు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని ఉద్యోగ నాయకులు రమణ , సత్యాన్నారాయణ లు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టి 1010 రోజుకి చేరుకుంది.నిరసన తెలిపేందుకు వేసిన టెంట్ కూడా శిధిలావస్థకు చేరిన ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని వాపోయారు.ప్రాణాలు తెగించి కోవిడ్ మొదటి రెండవ దశలో పనిచేశామన్నారు.నిరసన శిబిరం ముందు నుంచే మంత్రులు రాజకీయ నాయకులు కలెక్టర్,సూపర్డెంట్ వెళుతున్న మమ్ములను అనాధలుగానే చూస్తున్నారని ఆవేదం చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై కరుణించి మా ఆకలి కేకలు విని మాకు ఉద్యోగాలు ఇప్పించి కుటుంబాలు నిలబెట్టాలని వేడుకున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్ ఏడుకొండలు, రమణ, శివ,రాంబాబు సభ్యులు పాల్గొన్నారు.

