Sunday, February 15, 2026

Creating liberating content

సినిమాహెబ్బా…అయిదు మూవీల‌తో ఖుషి

హెబ్బా…అయిదు మూవీల‌తో ఖుషి

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరని చెప్పడానికి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లతో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు… అడపాదడపా సినిమాలు చేస్తోంది.
వచ్చిన ఛాన్సులను వదులుకోకుండా మంచి పేరు సంపాదించేందుకు ట్రై చేస్తోంది. మళ్లీ తన కెరీర్‌ను గాడిన పడేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. స్పెషల్ సాంగ్స్, పాత్ర ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం హెబ్బా. ఐదు సినిమాల్లో నటిస్తోంది. శాసనసభ మూవీలో ఐటెం సాంగ్ చేస్తోంది.
తెలిసినవాళ్ళు టైటిల్ తో తెరకెక్కుతున్న మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీటితోపాటు 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్యరావు సరసన హనీమూన్ ఎక్స్ ప్రెస్ లో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో మ‌ళ్లీ హెబ్బాకు మంచి రోజులు వచ్చాయంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article