హిందూపురం టౌన్
ఎన్నికల బదిలీల్లో భాగంగా హిందూపురం రూరల్ సర్కిల్ సిఐగా ఈరన్న ఆదివారం బాధ్యతల స్వీకరించారు గతంలో ఇక్కడ సిఐగా పనిచేస్తున్న వేణుగోపాల్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఈరన్న నియమించగా ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు ప్రజలు కూడా అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు