లేపాక్షి: లేపాక్షి మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సద్రుద్దీన్ ఖాన్ హిందూపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి గురువారం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, పార్లమెంట్ ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ సి సి ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేసుకునే గడువుశుక్రవారం తో ముగియనుంది . ఈ నేపథ్యంలో హిందూపురం శాసనసభ్యత్వానికి లేపాక్షి కి చెందిన సద్రుద్దీన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన హిందూపురం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో చర్చించిన మీదట దరఖాస్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లేపాక్షి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను అభ్యర్థిగా ఎంపిక చేస్తే అందరితో కలిసి తన విజయానికి నిరంతరం శ్రమిస్తానన్నారు. రెండు రోజుల క్రితమే హిందూపురం కాంగ్రెస్ నాయకులతో కలిసి మీరు సహకరిస్తే నేను కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకుంటానని తెలిపానని, వారి సహకారంతోనే నేను ఏపీసీసీలో దరఖాస్తు చేసుకున్నట్లు సద్రుద్దీన్ తెలిపారు. అతని వెంట కాంగ్రెస్ నాయకులు రామాంజనేయులు, రవికుమార్, నాగిరెడ్డి ,మోహన్ తదితరులు ఉన్నారు.