వైయస్సార్ కాంగ్రెస్ పై నిప్పులు
చెరిగిన షర్మిల…
తుని : ప్రతిపక్షంలో ఉండగా ఓ మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా ఇవాళ కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఆమె పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు లతో కలిసి రోడ్ షోలో గొల్ల అప్పారావు సెంటర్ చేరుకున్న షర్మిల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల మాట మరిచారన్నారు. విభజన హామీలు ప్రత్యేక హోదా సాధనలో చేతులెత్తేసిన జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారన్నారు. ప్రతిపక్ష హోదాలో తుని పర్యటనకు వచ్చినప్పుడు దివిస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ దివిషును ఒక ఇంచి కలపలేకపోయారన్నారు..
అనుభవించు రాజా.. దాడిశెట్టి రాజాపై షర్మిల సెటైర్లు
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలు సంపాదించిన దాడిశెట్టి రాజాను అనుభవించు రాజా అంటూ షర్మిల సమత్కరించారు. తాండవా నదికి రక్షణ గోడలు లేకపోయినా ఈ ప్రభుత్వం ప్రజలను వరదల నుంచి గట్టెక్కించలేని స్థితిలో ఉందన్నారు. మంత్రి రాజా మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించి ఇసుక మాఫియా గుట్కా మాఫియా మద్యం మాఫియాలకు సామ్రాట్ అయ్యారన్నారు