ఏలేశ్వరం:-శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరిగి ఇప్పటికి 20 సంవత్సరాల అయిందని, ప్రతి సంవత్సరం స్వామివారి వార్షికోత్సవం ముగింపు సందర్భంగా దాతల సహకారంతో అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ అన్న సమర్పణలో 2000 మంది అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంచర్ల సత్తిబాబు , మండ శ్రీనివాస్, మండ వీరేష్, కంచర్ల రమేష్, పిరాట్ల రాజా, గ్రంధి రామకృష్ణ, రేపాక రామలింగేశ్వరరావు (బాపన మందుల షాప్), పిరాట్ల విస్సు, పిరాట్ల రవి, బాదం సతీష్, పసుపులేటి శ్రీను, తాడిపత్రి జగన్, కుమార్ బేకరీ, తదితరులు భక్తులకు సహాయ సహకారాలు అందించారు.