కలెక్టర్ అరుణ్ బాబు
శ్రీ సత్య సాయి జిల్లా
జిల్లాలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వాహనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ పి అరుణ్ బాబు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో పేర్కొన్నారు.
గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
కొత్త జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలకు అందరి సహకారం ఉండాలన్నారు. కేంద్రఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను నిబంధనలను తూచా పాటించి నిష్పక్షపాత పారదర్శకంగా ఎన్నికల నిర్వహించడంలో కలిసి ముందుకు సాగుదాం అన్నారు. తుది ఓటరు జాబితా ప్రకటన అనంతరం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటినీ త్వరగా పరిశీలన పూర్తి చేసి పరిష్కరించాలని నియోజకవర్గ ఈఆర్వోలను ఆదేశించడం జరిగిందన్నారు. చేర్పులు, తొలగింపులు, సవరణలతో ఓటరు జాబితాను స్వచ్చీకరించడంలో జిల్లా యంత్రాంగం మొత్తం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలని,. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధికారులదృష్టికి తీసుకురావాలని, సత్యమైన, వాస్తవ సమాచారంతో ఏవైనా కంప్లైంట్స్ ఉంటే వ్రాతపూర్వకంగా ఇవ్వాలని .క్లెయిమ్స్ ఏవైనా తొలగించాలంటే కచ్చితంగా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి వారి అనుమతితోనే తొలగించడం జరుగుతుందని తెలిపారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునే హక్కు పొందేలా చర్యలు చేపట్టాలని ఫారం 6,7,8 పారదర్శకంగా విచారణ చేపడుతున్నామని తెలిపారు.సమస్యాత్మక కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్, అదనపు బలగాలు ఉంటాయని, ఈసారి ప్రతి సమస్యత్మక పోలింగ్ కేంద్రంలో జరిగే పోలింగ్ సరళిని సీసీ కెమెరా వెబ్ కాస్టింగ్ విధానంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయంగా పర్యవేక్షణ చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా ఓటర్లుగా నమోదు కాని వారు, 18-19 సంవత్సరాల యువత ఫామ్ 6 లో ఓటరు నమోదుకు నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల సమర్పించుచున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తుది జాబితా ప్రచురణ అనంతరం ఒకే ప్రాంతం నుంచి ఎక్కువ తొలగింపులు వస్తున్నాయని, ఒకే వ్యక్తి పేరుతో రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని, అలాగే డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉన్నాయని వాటన్నిటిని సరి చేయాలని పలు రాజకీయ పార్టీ ప్రతినిధులు కలెక్టర్ ను కోరారు. అలాంటి వాటిపై స్పష్టమైన ఆధారాలతో రాత మూలకంగా అందజేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని సరి చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు వాటికి సంబంధించి వివరాలను డి ఈ ఓ మరియు తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు రెండు ఏర్పాటు చేయడం జరిగిందని ఒకటి గోరంట్ల మాంటిసోరి హై స్కూల్ నందు, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని మరొకటి లేపాక్షి లోని చోళ సముద్రం సమీపంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఆయా నియోజకవర్గాలలో ప్రధాన కేంద్రాలలో ఈవీఎంల భద్రపరుచుట, మరియు రిసెప్షన్ సెంటర్ స్థలాలను పరిశీలించడం జరిగిందని వాటి జాబితాను ఎన్నికల కమిషన్ కు పంపడం జరిగిందని తెలిపారు పై కేంద్రాలను త్వరలో కమిషన్ ఆమోదించటం జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని తెలిపారు. ధర్మవరం మార్కెట్ యార్డ్ నందు ఈవీఎంలు, వి వి ప్యాడ్స్ భద్రపరచడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1561 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈవీఎం లు ధర్మవరం మార్కెట్ యార్డ్ నుంచి ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయనప్పుడు ప్రత్యేక బందోబస్తు ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో డిఆర్ఓ కొండయ్య, కలెక్టర్ కార్యాలయం ఎన్నికల విభాగం డిప్యూటీ తాహసిల్దార్ మైన వుద్దీన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం వేమయ్య యాదవ్, సిపిఎం టౌన్ కన్వీనర్ పి గంగాధర్, టిడిపి ప్రతినిధి ఎం మనోహర్, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధి పి రాజారెడ్డి, బిజెపి పార్టీ ప్రతినిధి ఎస్ రామాంజనేయులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి పి గంగాద్రి, జనసేన పార్టీ ప్రతినిధి అబ్దుల్ ఖాదర్, బీఎస్పీ పార్టీ సుబ్బరాయుడు, ఏ ఏ పి పార్టీ ప్రతినిధి డి నాగరాజులు పాల్గొన్నారు.