అమరావతి:-ఈ నెల 24 నుండి స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన విద్యా శాఖ.. వచ్చే అకడమిక్ ఇయర్ కోసం జూన్ 12న తిరిగి స్కూల్స్ తెరుచుకుంటాయని స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్ పేరిట విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ దీనిని తూచా తప్పకుండా పాటించాలని అధికారులు ఆదేశించారు.