ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల కేంద్రంలో సోమవారం పెద్దఎత్తున జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పట్టణఅధ్యక్షులు తుమ్మల మనోహర్ తెలిపారు.
ఈకార్యక్రమానికి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీలతోపాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా రానున్న ధర్మవరం తెలుగుదేశం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు భారీఊరేగింపుతో స్వాగతం ఉంటుందన్నారు.