డిపో అధికారి వేధింపులే కారణం
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో: విజయవాడ ఆర్టీసీ డిపో-1కి చెందిన కండక్టర్ ఝాన్సీ విధి నిర్వహణలో సొమ్మసిల్లి పడిపోయింది. ప్రయాణీకుల సహాయంతో తక్షణమే ఆటోలో ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. సేకరించిన సమాచారం ప్రకారం ఇందుకు గల కారణం డిపో అధికారి సునీత కారణమని తెలిసింది. విధి నిర్వహణ చేయలేనని సెలవు అడుగగా నిరాకరించింది సదరు అధికారి సిఐ సునీత. నిర్ణయించిన బస్సు రూట్ కి కండక్టర్ విధి నిర్వహించలేనని, సెలవు కోరింది. ఇందుకు నిరాకరించిన డిపో సిఐ సునీత బస్సు స్టాప్ లో బస్సు నెంబర్ ల సమయం పాలన నమోదు చేయాలని ఆదేశించింది. బస్సు స్టాప్ కి వచ్చే బస్సు రూట్ నెంబర్ లను, బస్సులు సమయ పాలన నమోదు చేస్తుండగా, ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయింది. గమనించిన ప్రయాణీకులు ఆమెను ఆటోలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం సురక్షితమని వైద్యులు తెలిపారు. ఆర్టీసీ డిపో-1 మహిళా అధికారిని సిఐ సునీత ని బదిలీ చేయాలని లేదా సస్పెండ్ చేయాలని బాధిత మహిళ కండక్టర్ లు గగ్గోలు పెడుతున్నారు.