చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తు-పరిటాల సునీతను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం
రాప్తాడు;సైకో పాలనలో అభివృద్ధి శూన్యం అని చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తు అని
పరిటాల సునీతను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం అని మండల తెదేపా నాయకులు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత సోదరుడు ధర్మవరపు మురళి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో నడిచాయని మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి పరిటాల సునీతను అఖండ మెజారిటీతో మెజారిటీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు , అనంతనేని రామకృష్ణ ,అనంతనేని ఎర్రి స్వామి సోమర నారాయణస్వామి, సి నారాయణస్వామి , మోహన్ రెడ్డి , మరోరు గోపాల్ , గంగలకుంట రమణ ,గుజ్జల నారాయణస్వామి , బాబయ్య ,ఇంద్రశేఖర్ , సాకే నారాయణస్వామి, గంగలకుంట కిష్ట ,అంపాపురం జయప్ప , డిష్ వెంకటరాముడు, పాలచర్ల ముత్యాలు,మరూరు కదిరప్ప , మరూరు నరేష్, , ఉప్పర శ్రీనివాసులు, జూటూరు రామకృష్ణ , బీరన్న శిక్షావలి , సర్పంచ్ నరేష్, బొమ్మపర్తి రాజశేఖర్ రెడ్డి, రాజలింగం,నరసింహులు , పుల్లలరేవు ప్రసాద్ , రాజేంద్ర నాయుడు , స్వర్ణక్క ,గేట్ సత్తి , మాన్లు కోసే కేశవ, నారాయణస్వామి, ముత్యాలప్ప, భాస్కర్ నాయుడు, చీరల వెంకటేష్ తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు