అనుచరులతో యనమల సమక్షంలో టీడీపీలో చేరిక

తుని:షాక్ లో మీద షాక్‌లు.అధికార వైసీపీ నుంచి తెలుగు దేశంలోకి వలసల జోరు కొనసాగుతోంది.పట్టున్న నేతలు మహిళా నేత యనమల దివ్యను అసెంబ్లీకి పంపించాలన్న ఏకైక లక్ష్యంతో యనమల నాయకత్వానికి జై కొడుతున్నారు.ఇప్పటికే తొండంగి మండలంపై పట్టు బిగించిన తెలుగుదేశం పార్టీకి తొండంగి సర్పంచ్ సోమాల ప్రసాద్ చేరిక మరింత ఊపునిస్తుంది.ఇవాళ సర్పంచ్ సోమాల ప్రసాద్,మురాలశెట్టి వెంకన్న,నేమాల బాబూరావు అధికార వైసిపికి గుడ్ బై చెప్పారు.వీరందరూ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.పసుపు కండువాలు కప్పిన యనమల రామకృష్ణుడు వీరిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో మురాలశెట్టి సత్తిబాబు,పక్కుర్తి నూకరాజు,దూలం మురళి,బంటుపల్లి అన్వేష్,నేమాల
కృష్ణ, నాగం పరమేష్,మాకినీడు సురేష్, తదితరులు పాల్గొన్నారు