పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఓజీ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ తో ప్రకటన చేశారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా తెరకెక్కుతోంది ఓజీ సినిమా. సాహో తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుజీత్, ఈ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. త్రివిక్రమ్ సెట్ చేసిన ప్రాజెక్టు కావడంతో.. పవన్ వెంటనే కాల్షీట్లు ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60శాతం పూర్తయింది. మిగతా భాగం షూటింగ్ కోసం పవన్ మరో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది.