రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కార్యదర్శి కృష్ణుడు
కోట నందూరు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు విమర్శించారు. కోటనందూరు మండలం కేఈ చిన్నయ్య పాలెంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంలపై టిడిపి శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన కృష్ణుడు వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగెత్తిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకంలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు పేద ప్రజల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంకం రెడ్డి రమేష్ ఆధ్వర్యంలో మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మోతుకూరు వెంకటేష్, దంతులూరి చిరంజీవి రాజు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, పెనుమచ్చ నాగేశ్వరరావు, రామచంద్ర రాజు, పోతల సూరిబాబు, లెక్కల భాస్కర్, అంకారెడ్డి సత్యనారాయణ, లగుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు