అమరావతి:రాజ్యసభ బరిలో నిలిచిన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీఎం నివాసంలో జగన్ తో భేటీ అయ్యారు. రాజ్యసభలో ఖాళీ అయిన మూడు సీట్లకు టీడీపీ పోటీపడితే ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. టీడీపీ తన అభ్యర్థులను నిలబెట్టకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి జగన్ తో వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.
…