హిందూపురం టౌన్
రాప్తాడులో ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధం సభను అందరూ కలిసి విజయవంతం చేద్దామని వైసిపి నాయకులు వేణురెడ్డి పిలుపు నిచ్చారు. సభ విజయ వంతం చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మేన్ జబీవుల్లా, కౌన్సిలర్లు, పట్టణ వ్యాప్తంగా ఉన్న నాయకులతో కలిసి సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా పట్టణానికి 80 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటున్న సిద్ధం సభను విజయవంతం చేయాలన్నారు. అనంతరం సిద్ధం సభకు సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అదే విధంగా ఇటీవల ఎ బ్లాక్ కన్వీనర్ గా నియమించిన మన్సూర్ ఖాన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.