కడప సిటీ
ప్రపంచ సామాజిక దినం సందర్భంగా నగరంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సామాజిక న్యాయ సభలో పలువురు పాల్గొన్నారు.
ఈ సభకు అభ్యుదయ చైతన్య వేదిక అధ్యక్షులు చీపాటి రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం చాలా అవసరం అనీ ,సమాజంలో అందరికీ సమాన అవకాశాలు అందాలని కోరారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం కోసమే ఏర్పడిందని,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిందని తెలిపారు.పేదలకు ఉచిత జనతా వస్త్రాలు ఇచ్చిందని, 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిందని చెప్పారు.ఎస్సీ, ఎస్టి, బీసీలకు ఎన్నో లోన్ లను ఇచ్చిందని, డ్వాక్రా ద్వారా మహిళలకు ఆర్థిక,సామాజిక న్యాయాన్ని అందించిందని పేర్కొన్నారు.
ఈ సభలో బిఎస్పి నాయకులు సగిలీ గుర్రప్ప, అఖిలపక్ష నాయకులు సీఆర్వీ ప్రసాద్, లోక్ సత్తా నాయకులు దేవర కృష్ణ, లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ రాజశేఖర్, ఎంఆర్పీఎస్ నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, ఒబులపతి ,దలితమిత్ర నాయకులు రామాంజనేయులు, ఆర్వీఎస్ కార్యదర్శి మల్లెల జగదీష్, వలసిగండ్ల సుబ్బారాయుడు, మరియు ట్రాన్స్ జెండర్ సమీరా పాల్గొన్నారు.