Thursday, September 4, 2025

Creating liberating content

తాజా వార్తలుసమస్య ఏదయినా సత్వరం స్పందించే గుణం…

సమస్య ఏదయినా సత్వరం స్పందించే గుణం…

*పని ఎంత పెద్దది ఆయినా పెదవివిరుపు చూపకుండా..
*అలసత్వం వహిస్తే అరక్షణం కూడా ఆలోచన చేయకుండా..
*ప్రజాసమస్యలకే పెద్ద పీట వేస్తూ…
*ప్రభుత్వ అజెండానే తమ అజెండాగా..
*ఎండయిన వానైనా వరదలైన ,బురదయున ,జడివానైన లెక్కచేయక…
*మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ..
*సర్వోన్నతాధికారి అంటేచల్లగా సేద తీరడం కాదంటూ…

  • లేడి బిగ్ బాస్ గా కె.వెట్రిసెల్వి
  • ఏలూరు జిల్లా కలెక్టర్ గా ఏడాది పూర్తి
    (మత్తే బాబి ప్రజాభూమి స్పెషల్ కరెస్పాండెంట్, ఏలూరు నుంచి)

ఎన్నో సవాళ్లు, మరెన్నో సమస్యలు అయినా లెక్కచేయని మొక్కవోని దీక్ష తో అకుంఠిత దీక్షతో వృత్తి పట్ల నిబద్ధత,నిరంతర ప్రజా సంరక్షణే పరమావధిగా ప్రభుత్వ అజెండానే తమ అజెండాగా వ్యక్తిగత అజెండా అనే మాటకు అనువంతకూడా అవకాశం లేకుండా అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ అనునిత్యం ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేస్తూ సర్వోన్నతాధికారి అంటే చల్లగా సేద తీరడం కాదని నిరూపిస్తూ ఏలూరు జిల్లా సర్వోన్నతాధికారిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న కలెక్టరమ్మ కె వెట్రి సెల్వి కి ప్రజాభూమి ప్రత్యేక అభినందలు తెలియజేస్తూ ఆమె పాలనపై ప్రజాభూమి అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రిసెల్వి పదవి భాద్యతలు స్వీకరించి దిగ్విజయంగా ఒక సంవత్సర కాలం గడిచింది,పదవి బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు చెప్పినట్లుగానే జిల్లా అభివృద్ధిలో ఆమె కృషి,జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించే తీరు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతూ, ఏలూరు జిల్లాలో తన ప్రాధాన్యతలను,జిల్లా సర్వతోముఖభివృద్ధిని వెట్రి సెల్వి మాటలతో కాక చేతలతో చేసి చూపారు,పోలవరం ప్రాజెక్ట్ తన తొలి ప్రాధాన్యత అని తెలిపిన నాటి నుండి ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా జరగడంలో తన పాత్ర అద్భుతం,ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా పేద ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కారం చూపుతూ చర్యలు తీసుకుంటున్నారు,ప్రజల సమస్యలను తన సమస్యలగా పనిచేస్తూ ప్రజలచే లేడి బిగ్ బాస్ సూపర్ అనిపించుకుంటున్నారు,ఇక జిల్లాలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటూ జిల్లా సమగ్రాభివృద్ధికై పనిచేసి రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలిపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సైతం శభాష్ అనిపించుకుని ఏడాది కాలం దిగ్విజయంగా పరిపాలన సాగించింది ఏలూరు జిల్లా కలెక్టర్ లేడీ బిగ్ బాస్ కె వెట్రి సెల్వి ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎంతో కాలంగా చేపలు, రొయ్యల పెంపకంలో వాడుతున్న నిషిద్ధ చికెన్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది సర్వోన్నతాధికారి చర్యలు బాగున్నా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం అక్రమ సంపాదనకు అలవాటు పడి దొంగచాటుగా తమ అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కానీ కలెక్టరమ్మ కన్నెర్ర చేసి కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అలానే ఎండ వాన వాగు వంక ,జడివాన,బురద రాత్రి పగలు నడి రేయి లోకూడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే ఆమె పరుగులు పెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ పేద ప్రజలకు నేనున్నానే భరోసా కల్పించడంలో కలెక్టర్ వెట్రి సెల్వి పేదల పాలిట ఈ కరుణామయిలాగా కీర్తింప బడుతుంది, ఏ అధికారి కూడా నిజమైన ఆనందం ఎప్పుడు పొందుతారంటే తమ నిర్ణయాల వల్ల పేద ప్రజల్లో ఆనంద బాష్పలు రాలుతాయో అప్పుడే లభించే ఆనందం,ఆ సంతోషం వేరు, అదే ఇండియన్ అడ్మినిస్ట్రేటీవీ సర్వీస్ అందుకు అక్షర సత్యంగా నిలుస్తోంది కలెక్టరమ్మ కె వెట్రిసెల్వీ, ఇలానే ప్రజా ఉపయోగకరమైన పాలనతో ముందుకు సాగాలని ఆమెకు అభివందనాలు అందిస్తున్నారు ఆ జిల్లా వాసులు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article