రామచంద్రపురం ఆర్డీవో సుదాసాగర్
రామచంద్రపురం
రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలో ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే ఎన్నికలకు ముందుగా గుర్తించి నివేదికలను ఇవ్వాలని ఓటరు నమోదు అదికారి,రామచంద్రపురం రెవెన్యూ డివిజినల్ అధికారి సుదాసాగర్ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నియోజకవర్గంలో ఎ ఇ ఆర్ ఓ లు , సెక్టార్ అధికారులు , పోలీసు సెక్టార్ అధికారులతో సమావేశమం నిర్వహించారు.
ఈసమావేశంలో సెక్టార్ అధికారులతో పలు అంశాలు చర్చించారు.
పోలింగ్ స్టేషన్లులో కనీస సదుపాయములు అయిన భవనము యొక్క భౌతిక స్థితి, అప్రోచ్ రోడ్డు, భవనము యొక్క ర్యాంప్ త్రాగు నీరు, విధ్యుత్, టాయిలెట్స్ తదితర సౌకర్యములపై చర్చించినారు. సదరు సౌకర్యము ఏమైనా లేని యెడల తక్షణమే నివేదిక ఇవ్వవలసినదిగా కోరారు.
అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ వి.ఎం) లపై ఓటర్లకు అవగాహన కల్పించవలసినదిగా సెక్టార్ అధికార్లకు తెలియజేసారు.
నియోజక వర్గములో పోలింగ్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతములు ఏమైనా ఉన్నచో వాటిని గుర్తించి వెంటనే వాటిపై నివేదిక ఇవ్వవలని కోరారు.
ఇవిఎం మిషన్లు పని చేయు విధానముపై సెక్టార్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే బస్సులకు రూట్స్ తనిఖీ చేయవలసినదిగా సమావేశంలోతెలిపారు.
సెక్టార్ అధికారులు ఏ ఏ పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయాలో ముందుగనే నిర్ధారించి తెలియపరిచారు.అదేవిధంగా కార్యక్రమంలో పలు చూచనలను సైతం ఆర్డీవో ఈసందర్భంగా తెలియజేసారు.