Tuesday, February 17, 2026

Creating liberating content

టాప్ న్యూస్సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌

సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు నూతనంగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పాటు సెలవులు ఉండేవి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్ ఓడీ లలో వారానికి ఐదు రోజుల పని దినాల విధానం ఈ నెల 27వ తేదీతో ముగుస్తుంది.అయితే ఈ విధానాన్ని మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కోరింది. సచివాలయ ఉద్యోగుల సంఘం కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆమోదం తెలిపారు. ఇవాళ లేదా రేపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article