టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సూపర్ నేచరల్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ వర్ష బోళ్ళమా హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకే ఎంటర్ట్తన్మెంట్స్, హస్య మూవీస్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి విదుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ టీం. విడుదల తేది దగ్గరపడుతన్న నేపథ్యంలో మూవీ మేకర్స్ ‘హరోంహార’ అనే పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆధ్యాత్మికతతో నిండిన ఈ పాటను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర కంపోజ్ చేశారు. పాటలోని పదాలు వింటుంటే ఒక్కసారిగా గూస్‌బంప్స్ ఫీలింగ్ కలుగుతోంది.