-నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా
-నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంది
-కరోనా సమయంలో బాధితులకు అండగా నిలబడింది తోపుదుర్తి కుటుంబమే
-ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
రాప్తాడు ;సంక్షేమం అభివృద్ధి వైకాపా పార్టీతోనే సాధ్యమని నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉందని నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని కరోనా సమయంలో బాధితులకు అండగా నిలబడింది భరోసా కల్పించింది తోపుదుర్తి కుటుంబమే అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు . మంగళవారం మండల పరిధిలోని హంపాపురం గ్రామంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ను చేసుకుంటేనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ పాలనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు . అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా కరోనా విపత్తు వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని నియోజకవర్గంలో కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసా కల్పించామని తెలిపారు ఇలా ఎన్నో సహాయ సహకారాలు నియోజకవర్గ ప్రజలకు అందించి మంచి పేరు తెచ్చుకున్న అనే తప్ప ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలు తలదించుకునే పని చేయలేదని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు వచ్చే నెల 13వ తేదీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బోయ శాంతమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో మండల వ్యాప్తంగా ఉన్న వైకాపా నాయకులు భారీగా తరలివచ్చి ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేశారు. హంపాపురం వైకాపా నాయకులు భారీ గజమాలతో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సత్కరించారు ఈ సందర్భంగా హంపాపురం వైకాపా నాయకులు భారీ విందును ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ వెంకటనారాయణ , గద్దె ఆగ్రోస్ కేశవరెడ్డి, సింగారప్ప, బుల్లె శివ బాల , మాజీ ఎంపీపీ వీరారెడ్డి , మాజీ డీలర్ కేశవరెడ్డి, రాజారెడ్డి , ప్రసాద్, ఎన్నికల ఇంచార్జ్ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి , వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు , మండల కన్వీనర్ జూటూరు శేఖర్ యూత్ కన్వీనర్ విశ్వనాథరెడ్డి , వైకాపా నాయకులు పసుపుల ఆదినారాయణ, పసుపుల నరసింహులు, కాంట్రాక్టర్ చంద్ర, చింతకాయల జయన్న , లోకేశ్వర్ రెడ్డి సాకే నారాయణస్వామి కొండారెడ్డి డొక్కా రామచంద్ర నల్లప్ప,తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

