Sunday, February 15, 2026

Creating liberating content

టాప్ న్యూస్షర్మిల మాకు రాజకీయ శత్రువే: మంత్రి పెద్దిరెడ్డి

షర్మిల మాకు రాజకీయ శత్రువే: మంత్రి పెద్దిరెడ్డి

హిందూపూర్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో చీలికలు రావడానికి ముఖ్య కారకుడు చంద్రబాబేనని, షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత కాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో జ‌రిగిన పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌లు స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని… కాంగ్రెస్ లో ఉన్నవాళ్లంతా ఎప్పుడో వైసీపీలోకి వచ్చేశారని వివరించారు. రఘువీరా, షర్మిల, గిడుగు రుద్రరాజు, కేవీపీ.. ఈ నలుగురు మాత్రమే చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్ధి శాంతమ్మ, అసెంబ్లీ సమన్వయకర్త టి.ఎన్. దీపికలు పాల్గొన్నారు…వారిని ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ హిందూపూర్ లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోటీకి మహిళలను సిఎం జగన్ ఎంపిక చేశార‌ని,వారిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article