పుట్లూరు:పుట్లూరు మండలంలోని ఎస్ తిమ్మాపురం గ్రామం నందు శుక్రవారం శ్రీశ్రీశ్రీ అవధూత నిరంజన గురు రంగస్వామి 88వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అనంతరం వచ్చే మొదటి అమావాస్య రోజు ఆరాధన మహోత్సవాన్ని గ్రామస్తులు అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పల్లకిలో శ్రీశ్రీశ్రీ అవధూత నిరంజన్ గురు రంగస్వామి చిత్రపటాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో భజనలతో ఊరేగిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు భక్త చింతామణి పూర్తి నాటకమును ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే శనివారం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రెండు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.