మార్కాపురం:మార్కాపురంలోని కం భం రోడ్డులో ఉన్న ప్రసన్నవెంకటేశ్వరస్వామి ఆలయంలో షష్ఠమ బ్రహ్మోత్సవాల సం దర్భంగా భూనీలా సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవం జరిగింది. ఉదయం 6 గంటలకు స్వామివారిని హనుమంత వాహనంపై ఊరే గించారు. అనంతరం 11 గంటలకు ఆలయ అర్చకులు అరుణ్స్వామి ఆధ్వర్యంలో అర్చ కులు ఉభయ దేవేరులతో కలిసి స్వామివా రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రతి ష్ఠించి వివిధ రకాల ఆభరణాలు, పూలతో అలంకరించి కల్యాణ క్రతువును నిర్వహిం చారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టీపీ వెంకటేశ్వర్లు, కార్యదర్శి కొండలరావు, అదనపు కార్యదర్శి నిట్టూరి రమేష్, కోశాధిగారి పిచ్చిరావు, ప్రతినిధులు రావిపాటి రాజా, విట్టా వెంకటేశ్వర్లు, ఆర్ రామారావు, టి.నరసింహారావు పాల్గొన్నారు.

