మార్కాపురం:మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ బ్రహ్మోత్సవాల సందర్భంగా 43 రోజుల హుండీ లెక్కింపు అక్షరాల తొమ్మిది లక్షల 53 వేల 364 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాస రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వర రాజు పర్యవేక్షణలో దేవస్థానం కమిటీ సభ్యులు మరియు రాజ్యలక్ష్మి సేవా సంఘం మహిళా బృందం వికాస తరంగిణి మహిళా బృందం స్వామివారి భక్తులు పాల్గొని కార్యక్రమం నిర్వహించారు

