చంద్రగిరి:
చంద్రగిరి గ్రామ దేవత మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం నందు సోమవారం పరివార దేవతామూర్తుల బాలాలయ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వచనము, పంచగవ్యము, నవగ్రహ అష్టదిక్పాలక, పంచపాలక ప్రధాన దేవత అవాహనము, గణపతి, సుబ్రహ్మణ్య ,నవగ్రహ కలాన్యాస జీర్ణోధారణ, ప్రాయశ్చిత, శాంతి హోమాదులు ఇటుకల శివరామయ్య శర్మ వారిచే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ యా రాశి చంద్రశేఖర్ రెడ్డి, కార్య నిర్వహణాధికారి పి. రామకృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.