పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి.

ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు.
ఉదయం సుప్రభాత సేవ,ఖడ్గమాలార్చన,లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన,చండీ హోమం, శాంతి కళ్యాణం,సూర్యోపాసన, అష్టోత్తరం, సహస్ర నామం తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించిన ఈ గవర్నెస్ -వాట్సాప్ సేవ ద్వారా వివిధ పూజల టిక్కెట్లను భక్తులు సులభం గా బుక్ చేసుకుని దేవస్థానం నకు చేరుకుంటున్నారు.విద్యార్థుల రాక,వివాహాల సీజన్, వేసవి రద్దీ సందర్బంగా ప్రతీ ఒక్క భక్తునికీ శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె. రామచంద్ర మోహన్ వారి ఆదేశాలకనుగుణంగా దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టడమైనది. ఉదయం నుండి కార్యనిర్వహణాధికారి కె.రామచంద్ర మోహన్ ఆలయంలోనే ఉండి భక్తులకు అందుతున్న వివిధ సౌకర్యాలను పర్యవేక్షించారు.భక్తుల రద్దీ అనుసరించి రూ. 500/- టిక్కెట్ ల అమ్మకాలు నిలిపివేసి అంతరాలయ దర్శనం నిలుపుదల చేసి, ముఖ మండపం నుండి వేగం గావివిధ దర్శనం క్యూలైన్లు నడిచేలా చర్యలు తీసుకోవడమైనది.వివిధ క్యూ మార్గాల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దేవస్థానం అందిస్తున్న ఉచిత ప్రసాదము, నిత్య అన్నప్రసాదమును భక్తి శ్రద్దలతో స్వీకరించారు.చలివేంద్రాలు ద్వారా భక్తులకు త్రాగునీరు, ఉచిత మజ్జిగ పంపిణీ చేసి భక్తుల దాహార్తిని తీర్చే చర్యలు చేపట్టడమైనది.ఉచిత ప్రసాద వితరణ నిరంతరం కొనసాగింది.ఉపాలయాలలో భక్తుల రద్దీ కి తగ్గట్లు ఏర్పాట్లు చేయడమైనది.వృద్ధులు, వికలాంగుల, చంటి పిల్లల తల్లులకు త్వరితంగా దర్శనం అయ్యే ఏర్పాటు చేయడమైనది.ఈరోజు ఉదయం భారీ వర్షం కురవడం వలన ఘాట్ రోడ్ మూసివేసినా, శ్రీ కనకదుర్గా నగర్ మార్గం గుండా భక్తుల రాకపోకలు కొనసాగేందుకు తగు చర్యలు తీసుకోవడంతో,, లిఫ్ట్ వద్ద రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవడంతో సామాన్య భక్తులు సులభతరంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.