మంత్రి వాసంశెట్టి సుభాష్.
రామచంద్రపురం :విద్యార్థులకు నాణ్యమైన శుభ్రమైన ఆహారం అందించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బుధవారం రామచంద్రపురం మండలం తాళ్లపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు తెలుగుదేశం నాయకుడు మేడిశెట్టి శ్రీమసేన్ అందించిన పెన్నులు నోటు పుస్తకాలను మంత్రి విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ నెలలో రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేస్తానని విద్యార్థులకు కచ్చితంగా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు అధ్యాపక సిబ్బందికి సూచించారు .మెరుగైన ఆహారం ద్వారా ఆరోగ్యం సమకూరుతుందని తద్వారా విద్యార్థులు మంచి ఆరోగ్యం పొంది ఉన్నత విద్య అభ్యసిస్తారని అన్నారు .పాఠశాలలో పరిశుభ్రత నాణ్యమైన ఆహారం తప్పనిసరి అని వీటిని ఆయా అధ్యాపక బృందాలు గమనించాలని మంత్రి సుభాష్ ఈసందర్భంగా సూచించారు .మంత్రి వెంట మేడిశెట్టి శ్రీమసేన్ , ఏలూరు ఏసుదాసు , దొంగల శ్రీధర్ బుదేటి బాబి ,అంకం బుజ్జి మేడిశెట్టి భాస్కరరావు వనం శ్రీను తెలుగుదేశం జనసేన టిడిపి బిజెపి నాయకులు ,కార్యకర్తలు,రామచంద్రపురం మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్, మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తాళ్లపాలెం ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణరావు , అధ్యాపక సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.


